Friday, March 27, 2015

స్ర్ముతి గీతం . . . ! ! !


మనసులో మనసు లేదు,
అది మరుభూమి చుట్టే తిరుగుతోంది!
నిన్నటి నుండి మీరు లేరన్న నిజం,
నీడలా, పీడలా వెంటాడుతూనేవుంది.
అక్షరాలు హ్రస్వాలైతే, దు:ఖం
దీర్ఘమతుంది......కాలం
కలల జ్ఞాపకాల్ని మోసుకుపోతుంది.
వందేళ్లపని, యాభై ఏళ్ళలో చేస్తే,
ఈ (సాహితీ) ప్రపంచానికి
మీతో పనేంటి ?

బహుశా అమరులకు అవధానం
అవసరం అయ్యిందేమో?.....
హడావుడిగా తీసుకెళ్ళారు......
నాకు మాత్రం......’ఒంటరి పూలబుట్ట’ తో,
 రాలిన సుమాల నేరుకుంటూ,
స్వర్గలోకపు స్వాగత ద్వారాన్ని దాటుతున్న
‘రత్నాల బండి’ లోంచి, మీ నీడ వెచ్చని జ్ఞాపకంలా
కనబడుతునే వుంది.
చాల సంవత్సరాల తర్వాత కలం, దానంతటదే కదిలింది,
సిరాలేకపోయినా....కన్నీటి.......చుక్కలతో......
అమరలోకంలో మీ ‘భువన విజయం’
అలా సాగి పోనీ.......
ఇంక సెలవ్ !